అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం - సాక్షి

ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం: కోదండరాం. సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం ప్రకటించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోమని, తమ పార్టీకి తగిన సామర్థ్యం ఉందని, దాన్ని నిరూపించుకుంటామని చెప్పారు. పెట్రోలు, డీజిల్‌ ధరల ...

కేంద్ర మాజీమంత్రి దత్తన్నకు పుత్రశోకం - సాక్షి

భోజనం చేస్తూనే కుప్పకూలిన వైష్ణవ్‌. గుండెపోటుతో హఠాన్మరణం. నివాళులర్పించిన గవర్నర్, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు. అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు. సాక్షి, హైదరాబాద్‌: మాజీ కేంద్రమంత్రి, సికింద్రాబాద్‌ ఎంపీ బండారు దత్తాత్రేయ పుత్రశోకంతో తల్లడిల్లిపోయారు. ఏకైక కుమారుడు వైష్ణవ్‌(21) మంగళవారం అర్ధరాత్రి హఠాన్మరణం చెందారు.

ఇంత క్రూరమా?: తూత్తుకుడి ఘటనపై రజినీ ఆగ్రహం, కమల్‌పై కేసు నమోదు - Oneindia Telugu

చెన్నై: తూత్తుకుడి ఘటనపై సూపర్‌స్టార్ రజనీకాంత్ తీవ్రంగా స్పందించారు. 'స్టెరిలైట్‌ ఆందోళనకు రాజకీయాల్ని కలిపి, ప్రభుత్వం ఇంటలిజెన్స్‌‌ డిపార్ట్‌మెంట్‌ను దుర్వినియోగం చేసింది. భద్రతా బలగాలు క్రూరంగా ప్రవర్తించడాన్ని నేను ఖండిస్తున్నా. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా' అని రజనీ పేర్కొన్నారు.

టార్గెట్ బీజేపీ: జాతీయ నేతలతో చంద్రబాబు, మరోసారి కీలకంగా మారుతున్నారా? - Oneindia Telugu

బెంగళూరు: బీజేపీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరుకు చంద్రబాబు వెళ్లిన విషయం తెలిసిందే. బెంగళూరుకు చేరుకున్న చంద్రబాబుకు అక్కడి తెలుగువారు ఘనస్వాగతం పలికారు. తన పిలుపు మేరకు ...ఇంకా మరిన్ని »

కుమారస్వామికి మోదీ ఫోన్‌.. బలపరీక్ష! - సాక్షి

సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ ప్రభుత్వం ఏర్పాటైంది. కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా జేడీఎస్‌ నేత కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ నేత, పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ వజుభాయ్‌ వాలా వీరిద్దరి చేత విధాన సౌదలో ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే. కర్ణాటక నూతన సీఎం కుమారస్వామికి ...

రోహింగ్యా ఉగ్రవాదుల ఊచకోత.. 99 మంది హిందువుల బలి - Andhrabhoomi

యాంగాన్, మే 23: మయన్మార్‌లో ఆ దేశ సైనికుల దాడికి భయపడి ఆ దేశంలో నివసిస్తున్న ఏడు లక్షల మంది రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్, ఇతర దేశాలకు పారిపోయారని, అమాయకులైన రోహింగ్యాలపై ఇలాంటి దాడులు సరికావని ఇంతకాలం అంతర్జాతీయ సమాజం సానుభూతితో పేర్కొంటుండగా, దానిపై పరిశోధన చేసిన అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వారిలోని క్రూరచర్యలను ...

ప్రమాణ స్వీకారానికి ఉద్ధవ్, నవీన్‌ దూరం - సాక్షి

ముంబై/భువనేశ్వర్‌: ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శివసేన అధినేత ఉద్ధవ్‌ థాకరేతోపాటు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ దూరంగా ఉన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి దేవెగౌడ పంపిన ఆహ్వానాన్ని శివసేన అధినేత ఉద్ధవ్‌ సున్నితంగా తిరస్కరించారని ఆ పార్టీ ఎంపీ తెలిపారు. పాల్ఘార్‌ లోక్‌సభ స్థానానికి 28న జరిగే ఉప ఎన్నికల ప్రచారంలో ఉద్ధవ్‌ బిజీగా ఉన్నందునే ...

కేసీఆర్‌ను గద్దె దింపడమే లక్ష్యం - సాక్షి

ఆయన మళ్లీ గెలిస్తే ప్రజలు బిచ్చగాళ్లవుతారు: కోమటిరెడ్డి. అందరం కష్టపడి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తాం. సీఎం కార్యాలయం నుంచి కోమటిరెడ్డికి శుభాకాంక్షల లేఖ. సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను గద్దె దింపడమే తన లక్ష్యమని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌ మళ్లీ గెలిస్తే రాష్ట్ర ప్రజలు ...ఇంకా మరిన్ని »

భద్రతా సిబ్బంది కొరత.. - ఆంధ్రజ్యోతి

ఎచ్చెర్ల, మే 23: పవన్‌ కల్యాణ్‌ గురువారం పోరాట యాత్రకు విరామం ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలో సొంత భద్రతా సిబ్బందితోనే పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ బృందంలోని 11 మంది గాయపడడంతో వారిని స్వస్థలానికి పంపారు. దీంతో అనివార్య పరిస్థితుల్లో గురువారం యాత్రకు విరామం ఇస్తున్నట్లు పవన్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. జీవిత భాగస్వామి కోసం ...ఇంకా మరిన్ని »

సీపీఎస్‌ ఉద్యోగులకు శుభవార్త - ఆంధ్రజ్యోతి

రిటైర్మెంట్‌, డెత్‌ గ్రాట్యుటీ అమలు; 2004 సెప్టెంబరు 1 నుంచి వర్తింపు. హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సీపీఎస్‌) ఉద్యోగులకు తీపికబురు. ఎన్నేళ్లుగానో ఎదురుచూస్తున్న గ్రాట్యుటీ ఫలాలు అందబోతున్నాయి. సీఎం కేసీఆర్‌ ఇటీవల ఇచ్చిన హామీ మేరకు.. రాష్ట్రంలో సీపీఎస్‌ కింద ఉన్న 1.32 లక్షల మంది ఉద్యోగులు, ...ఇంకా మరిన్ని »

లినీ కుటుంబానికి సర్కార్ బాసట, భర్తకు ఉద్యోగం,రూ. 20 లక్షల పరిహారం - Oneindia Telugu

తిరువనంతపురం :నిపా పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తూ అదే వ్యాధికి గురైన లిని అనే నర్సు కేరళలో మృతి చెందింది. అయితే లినీ కుటుంబానికి కేరళ ప్రభుత్వం అండగా ఉంటామని ప్రకటించింది. నర్సు లినీ భర్త సజీశ్‌కు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇద్దరు పిల్లలకు చెరో రూ.10 లక్షలను కేటాయించనున్నట్టు సీఎం విజయన్ ప్రకటించారు. Nipah Virus: Everything About The Virus ...

చంద్రబాబు ఇంట్లో సోదాలు చేసుకోండి: బోండా ఉమ సవాల్ - Samayam Telugu

తిరుమల తిరుపతి దేవస్థానంలోని పోటు నేలమాళిగలోని లభించిన విలువైన ఆభరణాలను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన నివాసాలకు తరలించారంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై తాజాగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు బోండా ఉమ స్పందించారు. బుధవారం విజయవాడలో ...ఇంకా మరిన్ని »

నిమ్స్‌కు 399 పోస్టులు - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌: నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌)లో ఖాళీగా ఉన్న 399 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. శాఖాపరమైన ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో వీటిని భర్తీ చేయనున్నారు. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి శివశంకర్‌ ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం భర్తీకి అనుమతిచ్చిన పోస్టులు.. ప్రొఫెసర్లు 14, అసోసియేట్‌ ...

మోదీ అశ్వమేధ గుర్రాన్ని కట్టేశాం - సాక్షి

బెంగళూరు/మైసూరు: ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాల అశ్వమేధ గుర్రాన్ని కర్ణాటకలో జేడీఎస్‌–కాంగ్రెస్‌ కూటమి కట్టేసిందని కర్ణాటక సీఎం కుమారస్వామి వ్యాఖ్యానించారు. సీఎంగా ప్రమాణం చేశాక మాట్లాడుతూ 'మోదీ, షాల అశ్వమేధ గుర్రాన్ని కట్టేయడమే నా లక్ష్యమని యూపీ ఎన్నికల తర్వాత చెప్పా. కాంగ్రెస్‌ సాయంతో ఈరోజు కర్ణాటకలో ...ఇంకా మరిన్ని »

ఇదీ జరిగింది: జ్యోతుల నెహ్రూ నివాసంలో ఐటీ సోదాలపై తనయుడి వివరణ - Oneindia Telugu

అమరావతి: 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన జ్యోతుల నెహ్రూ ఇంటిపై ఆదాయపుపన్ను శాఖ దాడులు చేసినట్లుగా ప్రచారం జరిగింది. విశాఖపట్నానికి చెందిన అధికారులు ఆయన స్వగ్రామమైన ఇర్రిపాకలోని ఇంట్లో సోదాలు నిర్వహించినట్లుగా ప్రచారం ...

తెలంగాణ పరిస్థితి తెచ్చుకోవద్దు, కరెంట్ తీసి నాపై దాడి ప్రయత్నమా, బట్టలూడదీసి ... - Oneindia Telugu

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి నిప్పులు చెరిగారు. విభజన నుంచి ప్రత్యేక హోదా వరకు చంద్రబాబు ఇచ్చిన హామీలను అన్నింటిని విస్మరించారని ధ్వజమెత్తారు. అంతేకాదు, తనపై కొందరు కిరాయి రౌడీలు రాత్రిపూట దాడికి ప్రయత్నించారని, అలాంటి వాటిపై ఊరుకునే సమస్యే లేదని ...

కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌: ఎర్రోళ్ల - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కాంట్రాక్టుల్లో దళిత, గిరిజనులకు 21ు రిజర్వేషన్‌ అమలు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అన్నారు. దేశంలో ఎన్నో అంశాల్లో ముందున్న తెలంగాణ.. ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు రిజర్వేషన్లు అమలుచేస్తున్న మొదటి రాష్ట్రంగా రికార్డు ...

కుమార స్వామి అనే నేను! - ఆంధ్రజ్యోతి

బెంగళూరు, మే 23 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్ర 25వ ముఖ్యమంత్రిగా జేడీఎస్‌ నేత హరదనహళ్లి దేవెగౌడ కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. పట్టు పంచె, పట్టు చొక్కా ధరించిన ఆయన.. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక విధాన సౌధలోని సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి ...

ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ టీచర్ల రాజీ! - ఆంధ్రజ్యోతి

ఏకీకృత సర్వీస్‌. రూల్స్‌పై కేసు వాపస్‌! సయోధ్య కుదిరితే. ప్రమోషన్లు, బదిలీలు. 2-3 రోజుల్లో బదిలీల. నమూనా డ్రాఫ్ట్‌. ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ టీచర్ల మధ్య సమసిన వివాదం? హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయుల మధ్య ఏళ్లుగా కొనసాగుతున్న వైరం సద్దుమణిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులే రాజీకి ...ఇంకా మరిన్ని »

'అల్లుడు టాక్స్': పవన్‌ కళ్యాణ్‌కు టీడీపీ ఎమ్మెల్యే లీగల్ నోటీసులు - Oneindia Telugu

శ్రీకాకుళం: జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌కు పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శివాజీ లీగల్‌ నోటీసులు పంపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పలాసలో తాను అవినీతికి పాల్పడినట్లు పవన్‌ చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్‌ విసిరారు. వ్యక్తిగతంగా తన కుటుంబంపై పవన్‌ విమర్శలు చేశారని దానికి సంజాయిషీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాగా ...

కులవృత్తులకు చేయూతనిస్తున్న కేసీఆర్ - Andhrabhoomi

హైదరాబాద్, మే 23: కులవృత్తులపై జీవనం సాగిస్తున్న కుటుంబాలకు కెసిఆర్ చేయూతను ఇస్తారని మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చెప్పారు. మంగళవారం సచివాలయంలో గంగపుత్ర, ముదిరాజ్ సంఘాలకు చెందిన రాజ్యసభ సభ్యులతో పాటు పలువురు నేతలు మంత్రి తలసానితో చర్చలు జరిపారు. తెలంగాణా ఏర్పడిన తర్వాత కులవృత్తుల కుటుంబాలు ఆర్థికంగా ...

పవన్‌కి లోకేశ్ విలువైన సూచన - ఆంధ్రజ్యోతి

అమరావతి: ఉద్దానం సమస్యపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలకు ట్విట్టర్ వేదిక సమాధానం ఇచ్చారు మంత్రి నారా లోకేశ్. తప్పుడు సమచారంతో పవన్‌ని కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఒక నిర్ణయానికి వచ్చే ముందు క్షేత్ర స్థాయిలో ఉన్న నిజాలను బేరీజు వేసుకోవాలని పవన్‌ను కోరుతున్నట్టు లోకేశ్ ట్వీట్ చేశారు. కిడ్నీ సమస్య ఉన్న పలాస, ...ఇంకా మరిన్ని »

హోదా కోసం ఆత్మహత్యాయత్నం - సాక్షి

ఆగిరిపల్లి (నూజివీడు): రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఎన్‌టీఆర్‌ వీరాభిమాని బెజవాడ శ్రీనివాసరావు బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బొద్దనపల్లి పంచాయతీ శివారు శోభనాపురం గ్రామానికి చెందిన బెజవాడ శ్రీనివాసరావు (55) ఆగిరిపల్లి తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు బుధవారం చేరుకుని ప్రత్యేకహోదా కోసం పురుగుల ...

జూన్‌ 18 నుంచి పసుపు వర్క్‌షాప్‌ - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌: పసుపు రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం, స్పైసెస్‌ బోర్డ్‌ సంయుక్తంగా జూన్‌ 18 నుంచి హైదరాబాద్‌లో వర్క్‌ షాప్‌ను నిర్వహించనున్నాయి. ఈ మేరకు బుధవారం స్పైస్‌ బోర్డ్‌ ప్రతినిధులు ఎంపీ కవితను కలిసి పసుపు పంట సాగులో మెళకువలు, పంట నిల్వ, మార్కెటింగ్‌ సౌకర్యాలు సహా ఇతర దేశాలకు ఎగుమతి వంటి అంశాలపై చర్చించారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో అపశ్రుతి: ఇద్దరు మృతి - Oneindia Telugu

రంగారెడ్డి: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టు తొలిదశ పనుల్లో భాగంగా కొల్లాపూర్‌ కృష్ణా తీరంలోని ఎల్లూరు, రేగుమానిగడ్డలో జరుగుతున్న సొరంగ నిర్మాణ పనుల వద్ద బుధవారం నార్లపూర్‌ భూగర్భ పంప్‌హౌజ్‌లోకి పోయే టన్నెల్‌లో పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ మొత్తం 18 మంది ...

'ఆంధ్రజ్యోతి' విలేకరికి మిషన్‌ కాకతీయ అవార్డు - ఆంధ్రజ్యోతి

మొదటి బహుమతిగా రూ.లక్ష, జ్ఞాపిక అందజేత; మీడియా విమర్శలను సానుకూలంగా తీసుకుంటాం: హరీశ్‌; ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రస్తావించిన మంత్రి; ఘనంగా మీడియా అవార్డుల ప్రదానోత్సవం. హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాగునీటి ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మిషన్‌ కాకతీయ మీడియా అవార్డులు-2017 కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది.ఇంకా మరిన్ని »

కుమరస్వామికి మోడీ అభినందనలు: 2019కి పెనుమార్పులన్న నూతన సీఎం - Oneindia Telugu

న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేసిన హెచ్‌డీ కుమారస్వామికి ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు కుమారస్వామికి ఫోన్‌ చేసిన ప్రధాని శుభాకాంక్షలు చెప్పారు. I congratulate Shri @hd_kumaraswamy Ji and @DrParameshwara Ji on taking oath as Chief Minister and Deputy Chief Minister of Karnataka. My best wishes for their tenure ahead.ఇంకా మరిన్ని »

సరిహద్దులో పేట్రేగిన పాక్‌ - సాక్షి

కాల్పుల్లో ఐదుగురు పౌరుల మృతి. సరిహద్దు గ్రామాల నుంచి 76 వేల మంది వలస. జమ్మూ / ఆర్నియా / శ్రీనగర్‌: కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్‌ మరోసారి తూట్లు పొడిచింది.అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంట జమ్మూకశ్మీర్‌లోని గ్రామాలు, బీఎస్‌ఎఫ్‌ ఔట్‌పోస్టులు లక్ష్యంగా పాక్‌ రేంజర్లు బుధవారం మోర్టార్లు, భారీ ఆయుధాలతో విచక్షణారహితంగా కాల్పులు ...ఇంకా మరిన్ని »

ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్య - ఆంధ్రజ్యోతి

డిజిటల్‌ క్లాస్‌ల ఏర్పాటుకు ఎన్‌ఆర్‌ఐల వితరణ; ఎన్‌ఆర్‌ఐ ప్రతినిధి కోమటి జయరామ్‌ చొరవ; 'పశ్చిమ' కలెక్టర్‌కు రూ.30 లక్షల చెక్కు అందజేత. ఏలూరు సిటీ, మే 23: పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కంప్యూటర్‌ విద్యను అందించడానికి ప్రవాసాంధ్రులు ముందుకొచ్చారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో డిజిటల్‌ ...

బిషప్‌పై షా వ్యాఖ్యలు అనుచితం: జూపూడి - ఆంధ్రజ్యోతి

అమరావతి, మే 23 (ఆంధ్రజ్యోతి): మతమౌఢ్యంతో, సామ్రాజ్యవాద కాంక్షతో వ్యవహరిస్తున్న బీజేపీ... దేశం కోసం ప్రార్థనలు చేయమన్న ఆర్చి బిషప్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తోందని ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకరరావు అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య, లౌకిక విలువల రక్షణకు ప్రార్థనలు చేయమని ఢిల్లీలోని ఆర్చిబిషప్‌ అనీల్‌ కౌంట్‌ జోసఫ్‌ లేఖపై బీజేపీ ...