కార్తీక మాసం ప్రారంభమైంది. ఇదే సమయంలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు కులసంఘాలు పార్టీల పేరిట వనభోజనాలు ఏర్పాటు చేసి, తమ వర్గం ఓటర్లను మచ్చిక చేసుకోవాలన్న ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్న వేళ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీ నేతలకు కొన్ని సూచనలు చేశారు. "జనసేన నాయకులందరికీ విన్నపం: కార్తీక మాసం వనభోజనాలు మీరు కావాలంటే వ్యకిగతంగా జరుపుకోండి. కానీ, నా పేరు మీద కానీ, జనసేన పార్టీ పేరు మీద కానీ జరపద్దని నా మనవి" అని ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. ఆపై "ఆడపడుచులకు, అక్కచెల్లెళ్లకు, తల్లులకు.. కార్తీకమాసం శుభాకాంక్షలు" అని ఆయన అన్నారు.

జనసేనానిలకు పవన్ విన్నపం | Manam News | మనం న్యూస్ | Telugu News, Latest Telugu News, Online News జనసేనానిలకు పవన్ విన్నపం

హైదరాబాద్: కార్తీకమాసంలో వనభోజనాలు చేసే జనసేన నాయకులకులందరికీ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓ విన్నపం చేశారు.