విడుదల కాని కాంగ్రెస్‌ తొలి జాబితా

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: మహాకూటమి సీట్ల సర్దుబాటు విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల జాబితా కూడా వెల్లడి కాలేదు. సొంత పార్టీ నేతలతో పాటు రాజకీయ వర్గాలు ఆసక్తితో ఎదురుచూస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారో కూడా స్పష్టత లేదు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ రూపొందించిన కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాను ఈనెల 12 లేదా 13 తేదీల్లో ప్రకటిస్తామని